కరుణానిధి కళ్లద్దాల వెనుక కథ ఇదే జర్మనీ నుంచి తెప్పించారట | karunanidhi eyeglasses

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని చూడగానే ముందుగా కన్పించేది ఆయన నల్లటి కళ్లద్దాలే. గత కొన్నేళ్లుగా ఆయన ఆ కళ్లద్దాలను వాడుతున్నారు. ఆయన భౌతికకాయానికి కూడా కళ్లద్దాలను తీయకుండా అలాగే ఉంచారు. ఆ కళ్లద్దాలు ఒకప్పుడు తమిళనాట ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి.

అయితే కరుణానిధి వాడిన ఆ కళ్లద్దాల వెనకున్న కథేంటంటే.. 1960ల్లో కరుణానిధి కంటికి చిన్న గాయమైందట. ఆ తర్వాత వైద్యులకు చూపించడంతో చికిత్స చేశారు. చికిత్స విజయవంతం అయినప్పటికీ ఆ కళ్లద్దాలను ఎల్లప్పుడూ వాడాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని డీఎంకే నేత ఇళన్‌గోవన్‌ మీడియా ద్వారా వెల్లడించారు. సాధారణంగా కంటికి శస్త్రచికిత్స చేసినప్పుడు వైద్యులు నల్ల కళ్లద్దాలు వాడాలని సూచిస్తారు. కరుణానిధి కూడా కొంతకాలం వైద్యులు సూచించిన కళ్లద్దాలే వాడేవారు. ఆ తర్వాత నల్లటి స్టైలిష్‌ గాగుల్స్‌ వాటడం మొదలుపెట్టారని డీఎంకే నేత తెలిపారు. ఆ కళ్లద్దాలను కరుణానిధి కోసం ప్రత్యేకంగా జర్మనీ నుంచి తెప్పించినట్లు ఒకానొక సందర్భంలో చెన్నైలోని విజయ కంటి ఆస్పత్రి వైద్యులు మీడియా ద్వారా వెల్లడించారు.

అలనాటి నటుడు, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ కూడా నల్లటి కళ్లద్దాలు పెట్టుకునేవారు. అలా తమిళ దిగ్గజాలైన కరుణానిధి, ఎంజీఆర్‌ల కళ్లద్దాలు తమిళనాడులో ట్రెండ్‌ సృష్టించాయి.


Comments

Popular posts from this blog

karunanidhi family tree |tamilnadu 5 time chief minister 3 wifes 4 sons 2 daughters and grandchildren

karunanidhi family| full details | 3 wifes ,4 sons, 2 daughters | karunanidhi assets

karunanidhi 5 time tamilnadu cm full story | dmk party chief | poltical history | karunanidhi wiki