Posts

Showing posts with the label spets

కరుణానిధి కళ్లద్దాల వెనుక కథ ఇదే జర్మనీ నుంచి తెప్పించారట | karunanidhi eyeglasses

Image
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని చూడగానే ముందుగా కన్పించేది ఆయన నల్లటి కళ్లద్దాలే. గత కొన్నేళ్లుగా ఆయన ఆ కళ్లద్దాలను వాడుతున్నారు. ఆయన భౌతికకాయానికి కూడా కళ్లద్దాలను తీయకుండా అలాగే ఉంచారు. ఆ కళ్లద్దాలు ఒకప్పుడు తమిళనాట ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. అయితే కరుణానిధి వాడిన ఆ కళ్లద్దాల వెనకున్న కథేంటంటే.. 1960ల్లో కరుణానిధి కంటికి చిన్న గాయమైందట. ఆ తర్వాత వైద్యులకు చూపించడంతో చికిత్స చేశారు. చికిత్స విజయవంతం అయినప్పటికీ ఆ కళ్లద్దాలను ఎల్లప్పుడూ వాడాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని డీఎంకే నేత ఇళన్‌గోవన్‌ మీడియా ద్వారా వెల్లడించారు. సాధారణంగా కంటికి శస్త్రచికిత్స చేసినప్పుడు వైద్యులు నల్ల కళ్లద్దాలు వాడాలని సూచిస్తారు. కరుణానిధి కూడా కొంతకాలం వైద్యులు సూచించిన కళ్లద్దాలే వాడేవారు. ఆ తర్వాత నల్లటి స్టైలిష్‌ గాగుల్స్‌ వాటడం మొదలుపెట్టారని డీఎంకే నేత తెలిపారు. ఆ కళ్లద్దాలను కరుణానిధి కోసం ప్రత్యేకంగా జర్మనీ నుంచి తెప్పించినట్లు ఒకానొక సందర్భంలో చెన్నైలోని విజయ కంటి ఆస్పత్రి వైద్యులు మీడియా ద్వారా వెల్లడించారు. అలనాటి నటుడు, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ కూడా నల్లటి కళ...