కరుణానిధి స్క్రీన్‌ప్లే అందించిన తెలుగు సినిమా karunanidhi movies
తమిళనాడు ప్రియతమ నేత.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి తెలుగు చిత్ర పరిశ్రమతోనూ అనుబంధం ఉంది. రాజకీయంగా తాను ఎంత బిజీగా ఉన్నా, తెలుగు సినిమా కార్యక్రమాలకు అప్పుడప్పుడు హాజరయ్యేవారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు 1971లో నిర్మించిన ‘ప్రేమనగర్’ చిత్రం శతదినోత్సవానికి కరుణానిధి హాజరై నటీనటులకు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘నీడ’ సినిమా శతదినోత్సవానికి కూడా కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక హీరో కృష్ణ నటించిన ‘అమ్మాయి మొగుడు-మామకు యముడు’ చిత్రానికి కరుణానిధి స్క్రీన్‌ప్లే అందించారు. జయశంకర్, జయచిత్ర జంటగా నటించిన ‘వండిక్కారన్ మగన్’ (బండివాడి కొడుకు) చిత్రానికి రీమేక్ ఇది. తమిళ చిత్రానికి మాటలు రాసిన కరుణానిధి తెలుగు చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. మేనల్లుడు ‘మురసోలి’ సెల్వం ఈ చిత్రానికి నిర్మాత కావడం గమనార్హం. కథలు, సంభాషణల రూపంలో మంచి సందేశం ఇచ్చేవారు. ‘పసమ్’, ‘తంగరత్నం’ చిత్రాల్లో జమీందారీతనాన్ని అంతం చేయడం, వితంతు వివాహం, అంటరానితనం వంటి అంశాలను ప్రస్తావించారు. వితంతు వివాహం అంటే విడ్డూరం అని మాట్లాడుకునే రోజుల్లో కరుణానిధి ‘మళ్లీ పెళ్...