కరుణానిధి స్క్రీన్‌ప్లే అందించిన తెలుగు సినిమా karunanidhi movies

తమిళనాడు ప్రియతమ నేత.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి తెలుగు చిత్ర పరిశ్రమతోనూ అనుబంధం ఉంది. రాజకీయంగా తాను ఎంత బిజీగా ఉన్నా, తెలుగు సినిమా కార్యక్రమాలకు అప్పుడప్పుడు హాజరయ్యేవారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు 1971లో నిర్మించిన ‘ప్రేమనగర్‌’ చిత్రం శతదినోత్సవానికి కరుణానిధి హాజరై నటీనటులకు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘నీడ’ సినిమా శతదినోత్సవానికి కూడా కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక హీరో కృష్ణ నటించిన ‘అమ్మాయి మొగుడు-మామకు యముడు’ చిత్రానికి కరుణానిధి స్క్రీన్‌ప్లే అందించారు. జయశంకర్‌, జయచిత్ర జంటగా నటించిన ‘వండిక్కారన్‌ మగన్‌’ (బండివాడి కొడుకు) చిత్రానికి రీమేక్‌ ఇది. తమిళ చిత్రానికి మాటలు రాసిన కరుణానిధి తెలుగు చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. మేనల్లుడు ‘మురసోలి’ సెల్వం ఈ చిత్రానికి నిర్మాత కావడం గమనార్హం.
కథలు, సంభాషణల రూపంలో మంచి సందేశం ఇచ్చేవారు. ‘పసమ్‌’, ‘తంగరత్నం’ చిత్రాల్లో జమీందారీతనాన్ని అంతం చేయడం, వితంతు వివాహం, అంటరానితనం వంటి అంశాలను ప్రస్తావించారు. వితంతు వివాహం అంటే విడ్డూరం అని మాట్లాడుకునే రోజుల్లో కరుణానిధి ‘మళ్లీ పెళ్లి’ అనే అంశంతో కథ రాయడమంటే సాహసమే. ఈ రెండు చిత్రాలకూ మంచి ఆదరణ లభించింది.


చివరి చిత్రం అదే: 1947లో విడుదలైన ‘రాజకుమారి’ నుంచి 2011లో వచ్చిన ‘పొన్నర్‌ శంకర్’ వరుకు పలు చిత్రాలకు కరుణానిధి కథారచయితగా, సంభాషణల రచయితగా, పాటల రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా వ్యవహరించారు. కరుణానిధి కథ అందించిన చివరి చిత్రం ‘పొన్నర్‌ శంకర్’. 1970లలో కరుణానిధి రాసిన ‘పొన్నర్‌ శంకర్‌’ నవల ఆధారంగా నటుడు త్యాగరాజన్‌ తన కుమారుడు ప్రశాంత్‌ని హీరోగా పెట్టి సినిమా తీశారు. 2011లో తమిళంలో విడుదలైన ఈ చిత్రం 2012లో తెలుగులో ‘రాజకోట రహస్యం’ టైటిల్‌తో రిలీజ్‌ అయింది.

Comments

Popular posts from this blog

karunanidhi family tree |tamilnadu 5 time chief minister 3 wifes 4 sons 2 daughters and grandchildren

karunanidhi family| full details | 3 wifes ,4 sons, 2 daughters | karunanidhi assets

karunanidhi 5 time tamilnadu cm full story | dmk party chief | poltical history | karunanidhi wiki