ముగిసిన కరుణానిధి అంత్యక్రియలు tamilnadu ex cm karunanidhi dead, Ending Karunanidhi funeral

లక్షలాది మంది అభిమానులు, డీఎంకే కార్యకర్తల అశ్రు నయనాల మధ్య ద్రవిడ ఉద్యమ సూరీడు, తమిళనాడు రాజకీయ దిగ్గజం కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. చెన్నై మెరీనా బీచ్‌లో కరుణానిధికి కన్నీటి వీడ్కోలు పలికారు. తన రాజకీయ గురువు అన్నాదురై స్మారక కేంద్రానికి ఆనుకుని ఉన్న అన్నా స్వ్కేర్‌లో కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు డీఎంకే శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు మెరీనా బీచ్‌కు భారీగా తరలివచ్చారు. కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్‌, కుమారులు ముత్తు,అళగిరి, స్టాలిన్‌, కుమార్తెలు సెల్వి, కనిమొళి, మారన్‌ సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు హాజరై కన్నీరు మున్నీరుగా విలపించారు. కాంగ్రెస్‌ నేత గులాంనబీ అజాద్‌, వీరప్పమొయిలీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తదితరులు కరుణానిధి పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, జేడీయూ నేత దేవెగౌడ, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, డీఎంకే నేతలు కరుణానిధి అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు.


3గంటల పాటు సాగిన అంతిమయాత్ర

రాజాజీ హాలు నుంచి సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం, శివానంద రోడ్‌, తంతైపెరియార్‌ రోడ్‌ మీదుగా మెరీనా బీచ్‌ వరకు సాగింది. మెరీనా బీచ్‌లోని మాజీ సీఎం అన్నాదురై స్మారక కేంద్రం సమీపంలో అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో రాత్రి 7 గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు ముగించారు. బంగారుపూత పూసిన శవపేటికలో కరుణానిధి పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ‘విరామం ఎరుగకుండా శ్రమించిన నాయకుడు.. ఇదిగో విశ్రమిస్తున్నాడు’ అని శవపేటిక మీద తమిళంలో రాయించారు.






















Comments

Popular posts from this blog

karunanidhi family tree |tamilnadu 5 time chief minister 3 wifes 4 sons 2 daughters and grandchildren

karunanidhi family| full details | 3 wifes ,4 sons, 2 daughters | karunanidhi assets

karunanidhi 5 time tamilnadu cm full story | dmk party chief | poltical history | karunanidhi wiki